విచిత్ర ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌తో టమాటాలు ఉచితం!
- మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌లో సెల్‌ఫోన్ షాపు యజమాని ప్రకటన
- పెరిగిన టమాటా ధరలను తనకు అనుకూలంగా మార్చుకున్న వ్యాపారి
- ఒక్కో స్మార్ట్‌ఫోన్‌తో రెండు కిలోల టమాటాలు ఫ్రీ
మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్‌కు చెందిన అశోక్ అగర్వాల్‌కు ఓ మొబైల్ షాపు ఉంది. పెరిగిన టమాటా ధరలతో ప్రజలు అల్లాడుతున్న విషయాన్ని గమనించి అశోక్ దానిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఒక స్మార్ట్‌ఫోన్ కొంటే రెండు కిలోల టమాటాలు ఉచితమని ప్రకటించాడు. ఈ ఆఫర్‌కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తున్నట్టు అశోక్ తెలిపాడు. వ్యాపారం కూడా పెరిగిందని సంతోషం వ్యక్తం చేశాడు.