vande bharat express: వందేభారత్ సరికొత్త లుక్ ఇదే.. త్వరలో ఇలా కనిపిస్తుంది!

  • ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించిన రైల్వే శాఖ మంత్రి
  • నీలం, తెలుపు రంగు నుండి నారింజ, బూడిద రంగులోకి మారనున్న వందేభారత్
  • 50కి చేరుకున్న వందేభారత్ రూట్ల సంఖ్య
Vande Bharats new look REVEALED to soon look like this

రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించి, వందేభారత్ రైళ్ల తయారీని పరిశీలించారు. సెమీ-హైస్పీడ్ వందేభారత్ రైలును ఇప్పటి వరకు మనం నీలం, తెలుపు రంగులో చూశాం. రానున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సరికొత్తగా వస్తోంది. నీలం, తెలుపు రంగులకు బదులు రైళ్లు నారింజ, బూడిద రంగులో రానున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు ఐసీఎఫ్ సీనియర్ అధికారులు కూడా సందర్శించారు. వీరి సరికొత్త కొత్త తరం హై-స్పీడ్ రైళ్ల ఉత్పత్తిని పరిశీలించారు. విశాలమైన క్యాంపస్‌లో తిరిగారు.

'వందే భారత్‌లో 25 డెవలప్‌మెంట్లు జరిగాయని, ఫీల్డ్ యూనిట్ నుండి తమకు లభించిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మెరుగుపరుస్తామని అశ్విని వైష్ణవ్ అన్నారు. అనంతరం ఐసీఎఫ్‌లోని అధికారులు, సిబ్బందితో మంత్రి సంభాషించి వారితో ఫొటోలు దిగారు. స్వదేశీ వందేభారత్ రైలులో అత్యాధునిక సౌకర్యాలు ఉంటాయి. ప్రయాణికులకు వేగవంతమైన, మరింత సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని ఇస్తోంది.

కాగా, గోరఖ్‌పూర్-లక్నో, జోధ్‌పూర్-సబర్మతి మార్గాలలో వందేభారత్ ప్రవేశపెట్టడంతో, దేశంలో వందేభారత్ రూట్ల సంఖ్య ఇప్పుడు 50కి చేరుకుంది. ప్రధాని మోదీ మొట్టమొదటి వందేభారత్ రైలును న్యూఢిల్లీ-వారణాసి మార్గంలో ప్రారంభించారు.

More Telugu News