గెలిచిన నాలుగేళ్లకు ఊరు గుర్తుకు వచ్చిందా?: మంత్రి అమర్నాథ్‌కు మహిళ నిలదీత
- అనకాపల్లి మండలం కొత్త తలారివారిపాలెంలో కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన
- శిలాఫలకం ఆవిష్కరించిన సమయంలో మహిళల నిలదీత
- మంత్రి వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసుల అడ్డగింత
పలువురు మహిళలు మంత్రి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. రహదారులు అధ్వానంగా ఉన్నాయని, డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు, కాలువ పనులకు మంత్రి శిలాఫలకం ఆవిష్కరించిన కొన్ని గంటల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు దీనిని ధ్వంసం చేశారు. ఇది చర్చనీయాంశంగా మారింది.