Wanaparthy District: మందుకొట్టి ఆఫీసుకొచ్చిన ఏఎస్‌డబ్ల్యూఓపై కలెక్టర్ వేటు

aswo suspended for attending duties while being intoxicated
  • వనపర్తి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఆఫీసులో వెలుగు చూసిన ఘటన
  • మద్యం తాగి ఆఫీసుకు వస్తున్న ఏఎస్‌డబ్ల్యూఓ, రోజు ఎంట్రీ థంబ్ ఇంప్రెషన్ వేయని వైనం
  • విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో స్వయంగా కార్యాలయానికి వచ్చి పరిశీలించిన కలెక్టర్
  • బ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఏఎస్‌డబ్ల్యూఓ మద్యం తాగినట్టు తేలడంతో సస్పెన్షన్ 
మద్యం సేవించి కార్యాలయానికి వస్తున్న ఏఎస్‌డబ్ల్యూఓను వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం సముదాయంలో జిల్లా ఎస్సీ అభివ‌‌ృద్ధి అధికారి ఆఫీసులో ఏఎస్‌డబ్ల్యూఓ సేవ్యా నాయక్ కొన్ని రోజులుగా మద్యం తాగి వస్తూ, ఎంట్రీ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వడం లేదని ఫిర్యాదు వచ్చాయి. 

విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన శుక్రవారం నేరుగా ఎస్సీ అభివృద్ధి అధికారి కార్యాలయానికి వెళ్లి సేవ్యానాయక్‌తో మాట్లాడారు. గ్రామీణ పోలీసు ఠాణా ఎస్సైతో బ్రీత్ అనలైజర్ పరీక్ష చేయించగా సేవ్యానాయక్ మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Wanaparthy District
Telangana
District Collector

More Telugu News