Python: ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ కలకలం

  • రాత్రివేళ గెస్ట్ హౌస్ వద్దకు వచ్చిన కొండచిలువ
  • భయాందోళనలకు గురైన సిబ్బంది
  • స్థానికంగా ఉంటున్న జెన్ కో ఉద్యోగికి సమాచారం అందించిన వైనం
  • చాకచక్యంగా పామును పట్టుకున్న ఉద్యోగి
  • పామును సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టిన అటవీశాఖ సిబ్బంది
Huge Python spotted at AP GENCO Guest House in Sileru

అల్లూరి జిల్లా లోయర్ సీలేరు ప్రాజెక్టు వద్ద ఉన్న ఏపీ జెన్ కో గెస్ట్ హౌస్ లో భారీ కొండచిలువ అందరినీ హడలెత్తించింది. రాత్రివేళ విధుల్లో ఉన్న సిబ్బంది ఈ కొండచిలువను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. 

స్థానికంగా నివాసం ఉంటున్న జెన్ కో ఉద్యోగి చింతా రాంబాబు ఈ కొండచిలువపై సమాచారం అందుకుని, హుటాహుటీన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకున్నారు. ఆ భారీ సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. 

ఆ కొండచిలువను అటవీ సిబ్బందికి అప్పగించగా, వారు దాన్ని సమీపంలోని అటవీప్రాంతంలో వదిలిపెట్టారు. కాగా, ఆ కొండచిలువ 12 అడుగుల పొడవు ఉన్నట్టు గుర్తించారు.

More Telugu News