Nara Lokesh: నారా లోకేశ్ స‌మ‌క్షంలో టీడీపీలో చేరిన తాడేప‌ల్లి నేత‌లు

Tadepalli leaders joins TDP under Nara Lokesh presence
  • కోవూరు క్యాంప్ సైట్ లో లోకేశ్ ను కలిసిన మంగళగిరి నియోజకవర్గ నేతలు
  • పసుపు కండువాలు కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన లోకేశ్
  • టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని మాటిచ్చిన తాడేపల్లి నేతలు
మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన వివిధ పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స‌మ‌క్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. 

నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం రాజుపాలెం పీఎస్సార్ కళ్యాణమండపం క్యాంప్ సైట్ వద్ద శుక్ర‌వారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో తాడేపల్లి టౌన్ నుంచి వ‌చ్చిన నేత‌లు లోకేశ్ ని క‌లిశారు. వారికి పసుపు కండువాలు కప్పిన లోకేశ్ సాదరంగా టీడీపీలోకి ఆహ్వానం పలికారు. టీడీపీ బ‌లోపేతానికి కృషి చేస్తామ‌ని తాడేపల్లి నేతలు లోకేశ్ కు మాటిచ్చారు. 

తాడేప‌ల్లి టౌన్‌కి చెందిన మాజీ కౌన్సిలర్ కాటాబత్తిని నిర్మల, సాగర్ బాబు దంప‌తులు, కాటాబత్తిని పవన్ కుమార్, కాటాబత్తిని చిన్నపాపారావు, తురకా నాగవేణి, షేక్ వహీదా, దొంతిరెడ్డి మధుసూదన్ రెడ్డి తదితరులు నేడు టీడీపీలో చేరినవారిలో ఉన్నారు. 

ఈ కార్యక్రమంలో తాడేపల్లి టౌన్ టీడీపీ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు, తాడేపల్లి మాజీ మున్సిపల్ ఛైర్మన్ కొయ్యగూర మహాలక్ష్మి, తాడేపల్లి రూరల్ అధ్యక్షుడు అమరా సుబ్బారావు, నియోజకవర్గ పరిశీలకుడు ముమ్మిడి సత్యనారాయణ, షేక్ మస్తాన్ వలి, కాకుమాను కుమార్, అన్నెం కుసుమ,షేక్ చాంద్ బాషా,తోట సాంబశివరావు, షేక్ నాగుల్ మీరా,షేక్ జాన్ షైదా, గోలి శౌరి, తదితరులు కూడా పాల్గొన్నారు.
Nara Lokesh
Tadepalli Leaders
TDP
Kovuru Camp Site
Nellore District

More Telugu News