Falaknuma Express: ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం: దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడి అరెస్టు

  • బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బెదిరింపు లేఖపై విచారణ..
  • అతనే రాశాడా, ఇంకెవరైనా రాశారా అనే కోణంలోనూ దర్యాప్తు
hyderabad police detained man for threating letter to south central railway

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు అగ్నిప్రమాదం ఘటన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వేకు ఇటీవల బెదిరింపు లేఖ రాసిన అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. బీహెచ్‌ఈఎల్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ బెదిరింపు లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ లేఖను అతనే రాశాడా, లేక ఇంకెవరైనా రాశారా? కారణమేంటి? ఇందులో కుట్రకోణం ఏమైనా ఉందా? వంటి విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు.

జూన్ 30వ తేదీన దక్షిణ మధ్య రైల్వేకు బెదిరింపు లేఖ అందింది. ఒడిశాలోని బాలాసోర్‌‌ తరహాలో ఢిల్లీ- హైదరాబాద్ రూట్‌లో రైలు ప్రమాదం జరిగే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖపై రైల్వే అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News