తిరుమల శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం
- వారాంతం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
- తిరుమల కొండపై పెరిగిన రద్దీ
- నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్
- వెలుపలికి వచ్చిన క్యూ లైన్లు
నిన్న స్వామివారిని 66,977 మంది దర్శించుకున్నారు. 33,020 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే తిరుమల వెంకన్నకు రూ.4.39 కోట్ల హుండీ ఆదాయం లభించింది.