Nara Lokesh: అమూల్ బేబీకి అవగాహన తక్కువ... పోజులు ఎక్కువ: నారా లోకేశ్

  • నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • బుచ్చిరెడ్డిపాలెంలో భారీ బహిరంగ సభ
  • జగన్ ను ఏకిపారేసిన లోకేశ్
  • నల్లతాచు అంటూ స్థానిక ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై విమర్శలు
Nara Lokesh take a swipe at CM Jagan

నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర హోరెత్తుతోంది. 148వ రోజు యువగళం పాదయాత్ర కోవూరు నియోజకవర్గంలో జననీరాజనాల నడుమ కొనసాగింది. బుచ్చిరెడ్డిపాలెంలో నిర్వహించిన బహిరంగసభకు నియోజకవర్గం నలుమూలల నుంచి జనం పోటెత్తారు. పట్టణంలోని వీధులన్నీ జనసంద్రంగా మారాయి. 

పాదయాత్ర ప్రారంభానికి ముందు చెల్లాయపాలెం క్యాంప్ సైట్ వద్ద బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నారా లోకేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు జవహర్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, దినేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

శిలాఫలకాలపై ఉన్న శ్రద్ధ పనులపై లేదేమి ప్రసన్నా!

బుచ్చిరెడ్డిపాలెంలో శిలాఫలకం వద్ద సెల్ఫీ దిగిన లోకేశ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ శిలాఫలకం చిత్తశుద్ధి లేని వైసీపీ పాలకుల చర్యలకు అద్దం పడుతోందని అన్నారు. రూ.2 కోట్లతో బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ భవనాన్ని నిర్మిస్తామని చెప్పి, 25-10-2020 నాడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి నేతృత్వంలో అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. 

రెండున్నరేళ్లయినా శిలాఫలకం అంత ఎత్తు కూడా భవనం గోడలు లేవలేదు. ఈ ప్రాంతంలో పిచ్చిమొక్కలు మొలిచి, మురికి కూపంగా మారింది. వైసీపీ ప్రజాప్రతినిధులకు అడ్డగోలు దోపిడీ, శిలాఫలకాలు, రంగులపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేకపోవడం ఈ రాష్ట్రప్రజల దౌర్భాగ్యం" అంటూ లోకేష్ విమర్శనాస్త్రాలు సంధించారు.

చిత్తూరు డెయిరీ ఆస్తులు అమూల్ కు క్విడ్ ప్రోకోలో భాగమే!

యువగళం దెబ్బకి జగన్ పర్మినెంట్ గా ఇడుపులపాయ ప్యాలస్ కి వెళ్లడం ఖాయమని నారా లోకేశ్ అన్నారు. కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో జరిగిన బహిరంగసభలో లోకేశ్ మాట్లాడుతూ... జగన్ బటన్ కి కరెంట్ లేదని ఎద్దేవా చేశారు. 

"అమ్మకే అన్నం పెట్టని వాడు అమ్మ ఒడి వేస్తాడా? ఎన్నికల ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మఒడి అన్నాడు. అధికారం వచ్చాకా అమ్మఒడి ని అర్ధ ఒడి చేసాడు. అందులో బాత్ రూమ్ మెయింటెనెన్స్ అంటూ రూ.2 వేలు కోత. బటన్ నొక్కి వారం రోజులు అయ్యింది అర్ధ ఒడి పడిందా? పడలేదు. కరెంట్ లేక ఆ బటన్ పనిచేయడం లేదు" అని వ్యంగ్యం ప్రదర్శించారు

ఆయనకు తెలిసిందల్లా క్విడ్ ప్రోకోనే!

జగన్ ఒక అమూల్ బేబీ. ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా? పాడి పరిశ్రమ మీద అమూల్ బేబీకి అవగాహన తక్కువ. పోజులు ఎక్కువ? టీడీపీ హయాంలో పాడి రైతుల్ని ఆదుకోవడానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసాం. పశువులు కొనడానికి రుణాల దగ్గర నుండి మేత, దాణా, మందులు, గోపాలమిత్ర, గోకులం వరకూ పాడి రైతుల్ని ఆదుకుంది టీడీపీ. 

అమూల్ బేబీకి అవి ఏమీ తెలియవు. అమూల్ పేరుతో మరో క్విడ్ ప్రో కో తప్ప. పాడి రైతుల్ని, సహకార డెయిరీలను నాశనం చేసి వేల కోట్ల ఆస్తులు, ప్రజల సొమ్ము గుజరాత్ కంపెనీకి దోచిపెడుతున్నాడు. 

నాలుగేళ్లు నిద్రపోయిన అమూల్ బేబీ ఇప్పుడు సడన్ గా కొత్త డ్రామా మొదలు పెట్టాడు. విజయ డెయిరీని చంపేశాడు. లీటర్ కి అదనంగా పాడిరైతులకు రూ.4 ఇస్తానని మాట తప్పాడు అమూల్ బేబీ. చిత్తూరు డెయిరీని తిరిగి ప్రారంభిస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఆస్తులు అన్ని అమూల్ కి రాసి ఇచ్చేశాడు.

జగన్ ఢిల్లీ వెళ్లింది ఎందుకు?

జగన్ స్పెషల్ ఫ్లైట్ లో మళ్లీ ఢిల్లీ వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో మీరు చెప్పాలి. మొదటి ఆప్షన్. బాబాయ్ మర్డర్ కేసులో సీబీఐ ఏ8 గా ప్రకటించిన అవినాశ్ ని కాపాడటానికి. రెండో ఆప్షన్ ఏ9 గా జగన్ పేరు పెట్టకుండా ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవడానికి. మూడో ఆప్షన్. సీబీఐ ఛార్జ్ షీట్ లో భార్య భారతీ రెడ్డి గారి పేరు లేకుండా చెయ్యడానికి. నాలుగో ఆప్షన్. ఆల్ ది ఎబోవ్. 

ఇప్పుడు చెప్పండి పిన్ని పసుపు, కుంకుమ చెరిపేసింది ఎవరు? జగన్. పిన్ని తాళి తెంచింది ఎవరు? జగన్. చెల్లి పై నిందలు వేసింది ఎవరు? జగన్. బాబాయ్ మర్డర్ ఎవరి రక్త చరిత్ర? జగనాసుర రక్త చరిత్ర.

కోవూరును మాఫియాలకు అడ్డాగా మార్చిన ప్రసన్న!

కోవూరుని అభివృద్ధి చేస్తారని భారీ మెజారిటీతో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని ప్రజలు గెలిపించారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? కానీ ఆయన కోవూరుని శాండ్, ల్యాండ్, వైన్, మైన్, బెట్టింగ్, రియల్ ఎస్టేట్ మాఫియాకి కేరాఫ్ అడ్రెస్ గా మార్చేశాడు. 

ఆయన అవినీతి గురించి తెలుసుకున్న తరువాత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి నల్లతాచు అని పేరు పెట్టా. డెయిలీ కలెక్షన్, వీక్లీ కలెక్షన్, మంత్లీ కలెక్షన్స్ లో నల్లతాచు ఫేమస్. ఇది నేను అనడం లేదు కోవూరు వైసీపీ నాయకులు, కార్యకర్తలే అంటున్నారు. 

వరి రైతుల్ని కూడా వదలలేదు ఈ నల్లతాచు. తక్కువ రేటుకి రైతుల నుండి ధాన్యం కొని ప్రభుత్వానికి ఎక్కువ రేటుకి అమ్మేశాడు. నాలుగేళ్లలో వరి రైతులు నష్టపోయి క్రాప్ హాలిడే ప్రకటిస్తే... అదే వరి అమ్ముకున్న నల్లతాచు రూ.50 కోట్లు కొట్టేసి హాలిడేకి వెళ్లి ఎంజాయ్ చేశాడు. 

ఇసుక దోపిడీతో విధ్వంసం!

నల్లతాచు బుచ్చి, కోవూరు, విడవలూరు, ఇందుకూరుపేటలో అక్రమంగా ఇసుక తవ్వేసి విధ్వంసం చేశారు. అక్రమ ఇసుక తవ్వకాల కారణంగా కోవూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఇళ్లలోకి వరద నీరు వచ్చి ప్రజలు నరకం చూశారు. చేపలు, రొయ్యలు కొట్టుకుపోయి ఆక్వా రైతులు నష్టపోయారు. 

బ్యాంకులను కూడా మోసం చేశాడు ఈ నల్లతాచు. దొంగ కాగితాలతో రూ.8 కోట్లు లేపేశాడు. అంతేకాదు, నల్లతాచు, ఆయన అనుచరులు గోవా, పాండిచ్చేరి నుండి లిక్కర్ తెచ్చి అమ్మేస్తున్నారు. ఈ వ్యాపారానికి హెడ్ అనిల్ బాబు. కనిగిరి రిజర్వాయర్ పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిలో రూ.100 కోట్లు విలువైన గ్రావెల్ తవ్వేశాడు. 

సొసైటీ నిధులు కూడా దిగమింగారు!

నల్లతాచు ఆఖరికి టీచర్ల ట్రాన్స్ ఫర్లలో కూడా డబ్బులు కొట్టేశాడు. రూ.84 కోట్లతో చేపట్టిన మలిదేవి కాలువ పనుల్లో 25 పర్సెంట్, రూ.96 కోట్ల ఎఫ్డీఆర్ పనుల్లో 60 పర్సెంట్ తీసుకున్నాడు. ఈ పనుల్లో నల్లతాచు వాటా రూ.58 కోట్లు. 

రియల్ ఎస్టేట్ మాఫియాకి కోవూరుని అడ్డాగా మార్చేశాడు. ఎన్ హెచ్ 65 ని ఆనుకొని అక్రమ లే అవుట్లు వచ్చాయి. 2019 లో నల్లతాచు అప్పు రూ.50 కోట్లు... ఈ నాలుగేళ్లలో సంపాదన ఎంతో తెలుసా రూ.1500 కోట్లు. రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్న షుగర్ ఫ్యాక్టరీని రూ.100 కోట్లకు కొట్టేసే కుట్ర చేస్తున్నాడు నల్లతాచు. దీనిని టీడీపీ అడ్డుకుంటుంది.

*యువగళం పాదయాత్ర వివరాలు*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం – 1933.2 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 16.1 కి.మీ.*

*149వ రోజు పాదయాత్ర వివరాలు (7-7-2023):*

*కోవూరు/కావలి అసెంబ్లీ నియోజకవర్గాలు (ఎస్ పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా)*

మధ్యాహ్నం 

2.00 – రాజుపాలెం పీఎస్సార్ కళ్యాణమండపంలో యానాదులతో ముఖాముఖి.

సాయంత్రం

4.00 – రాజుపాలెం పీఎస్సార్ కళ్యాణ మండపం నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.05 – రాజుపాలెంలో ధాన్యం రైతులతో సమావేశం.

4.45 – కొడవలూరు పర్లపల్లి సర్కిల్ లో స్థానికులతో సమావేశం.

5.15 – గాంధీ సంఘం వద్ద స్థానికులతో మాటామంతీ.

5.35 – గుండాలమ్మపాలెం వద్ద స్థానికులతో సమావేశం.

5.55 – బసవయ్యపాలెంలో స్థానికులతో మాటామంతీ.

6.20 – రామతీర్థం క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

7.00 – తలమంచి క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

7.20 – కావలి అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.

7.30 – నార్త్ అమలూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

7.50 – బెరంగుంటలో స్థానికులతో సమావేశం.

8.10 – బెరంగుంట రైస్ మిల్లు కాలనీలో స్థానికులతో సమావేశం.

8.20 – నార్త్ మోపూరులో స్థానికులతో సమావేశం.

8.50 – ఇందుపూరు క్రాస్ వద్ద స్థానికులతో సమావేశం.

9.50 – అల్లూరు శివారు విడిది కేంద్రంలో బస.

*******

More Telugu News