Engineering Seats: తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

  • కోర్ గ్రూప్ సీట్లను వెనక్కి ఇస్తాం, కంప్యూటర్ కోర్సుల సీట్లు పెంచాలన్న కాలేజీలు
  • 6,930 సీట్లకు అనుమతినిచ్చిన ప్రభుత్వం
  • మరో 7,635 ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్
Telangana govt gives green signal for another 14565 engineering seats

తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య భారీగా పెరిగింది. మరో 14,565 సీట్లు పెంచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్ గ్రూపులో సీట్లను వెనక్కి ఇస్తామని, వాటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో సీట్లు పెంచాలని ప్రభుత్వాన్ని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరాయి. దీంతో, 6,930 సీట్లకు ప్రభుత్వం అనుమతిని నిచ్చింది. దీంతో పాటు కొత్తగా మరో 7,635 ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా అనుమతిని ఇచ్చిన సీట్లతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరింది. అదనపు సీట్ల వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 27.39 కోట్ల భారం పడనుంది.

More Telugu News