Daggubati Purandeswari: ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కృషి చేస్తా: పురందేశ్వరి

Newly appointed BJP chief of Andhra Pradesh D Purandeswari pays a courtesy call on BJP president JP Nadda
  • బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పురందేశ్వరి
  • తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేంద్ర మాజీ మంత్రి
  • నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చానని ట్వీట్

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఏపీ స్టేట్ చీఫ్‌గా నియమితులైన తర్వాత తొలిసారిగా ఆయనతో ఈ రోజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. 

‘‘నడ్డాను కలిశాను. నాపై ఉంచిన నమ్మకానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాను. నాకిచ్చిన బాధ్యత విషయంలో నిబద్ధతతో పని చేస్తానని మాటిచ్చాను” అని పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఏపీలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీ, ఆంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News