Salman Khan: బాక్సాఫీస్ వద్దేమో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో మాత్రం ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసిన సల్మాన్ సినిమా

Salman Khan Kisi Ka Bhai Kisi Ki Jaan surpasses RRR viewership on Zee5
  • సల్మాన్, పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన కిసీ కా భాయ్ కిసీ కీ జాన్
  • ఏప్రిల్21న థియేటర్లలో విడుదలైన నిరాశ పరిచిన చిత్రం
  • జీ5 గ్లోబల్‌ లో స్ట్రీమ్ అయిన తొలి రోజే అత్యధిక వీక్షణలతో రికార్డు
సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’. విక్టరీ వెంకటేశ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. 225 కోట్ల రూపాయల బడ్జెట్‌ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21వ తేదీన విడుదలై తొలి రోజు నుంచే ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద 182 కోట్లు మాత్రమే రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది. 

‘జీ5 గ్లోబల్’లోకి వచ్చిన సల్మాన్ చిత్రం బుల్లితెరపై మాత్రం సంచలనాలు సృష్టిస్తోంది. ఓటీటీలోకి వచ్చిన తొలి రోజే అద్భుత ఆదరణ దక్కించుకొని రికార్డులు బ్రేక్ చేస్తోంది. మొదటి రోజే అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డును సల్మాన్ చిత్రం బ్రేక్ చేయడం విశేషం. అంతేకాదు ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన తొలి రోజే అత్యధిక వ్యూవర్షిప్ వచ్చిన చిత్రంగా నిలిచింది.
Salman Khan
Kisi Ka Bhai Kisi Ki Jaan
RRR
viewership
record
Zee5

More Telugu News