Mark Zuckerberg: 11 ఏళ్ల తర్వాత తొలిసారి ట్విట్టర్ లోకి వచ్చిన జుకర్ బర్గ్.. కారణం ఇదే!

  • ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్ ను డెవలప్ చేసిన మెటా
  • 'డబుల్ ఐడెంటిటీ' కార్టూన్ లోని ఫొటోను షేర్ చేసిన మార్క్
  • ఎలాంటి కామెంట్ చేయని మెటా సీఈవో
Mark Zuckerberg enters Twitter after 11 years

మెటా సీఈవో, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ 11 ఏళ్ల తర్వాత ట్విట్టర్ లో అడుగుపెట్టారు. ఈ ఉదయం ట్విట్టర్ లోకి లాగిన్ అయ్యాడు. ట్విట్టర్ కు పోటీగా మెటా డెవలప్ చేసిన థ్రెడ్ కు సంబంధించి పోస్ట్ చేశాడు. స్పైడర్ మేన్ దుస్తులు ధరించిన వ్యకి అదే దుస్తులు ధరించిన మరొక వ్యక్తిని చూపుతున్నట్టు ఉన్న చిత్రాన్ని షేర్ చేశాడు. ఇది 1967లో వచ్చిన స్పైడర్ మేన్ కార్టూన్ 'డబుల్ ఐడెంటిటీ' లోనిది. విలన్ హీరోగా కనిపించేందుకు ప్రయత్నించేలా ఆ చిత్రం ఉంది. అయితే కేవలం కార్టూన్ ఫొటోను మాత్రమే మార్క్ షేర్ చేశారు. ఆయన ఎలాంటి కామెంట్ చేయకపోవడం గమనార్హం. 

More Telugu News