పరువు తీస్తూ.. భార్య వేధిస్తోందని భర్త ఆత్మహత్య
- హైదరాబాద్ కుషాయిగూడలో వెలుగు చూసిన ఘటన
- వేరు కాపురం పెట్టాలంటూ భార్య ఒత్తిడి
- కుటుంబకలహాలతో పరువుపోతోందని భర్త ఆవేదన
- అతడి ఆవేదనను భార్య, ఆమె తల్లితండ్రులు కొట్టిపారేసిన వైనం
- పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్యాయత్నం, ఆసుపత్రిలో మృతి
ఈ విషయమై ఆమె పెడబొబ్బలు పెడుతుంటే విషయం బయటవారికి తెలిసి కుటుంబ పరువు పోతుందని వెంకట్ రెడ్డి ఒత్తిడికి లోనయ్యారు. వద్దని చెప్పినా భార్య వినకపోవడంతో చచ్చిపోతానని హెచ్చరించాడు. అయితే, ఇదంతా డ్రామాలని, అతడు చచ్చేది లేదని అత్తమామలు భార్య హేళన చేయడంతో వెంకట్ రెడ్డి అదే రోజున పురుగుల మందు తాగాడు. తల్లి ఆసుపత్రికి తరలించగా అక్కడ బుధవారం మృతి చెందాడు. మృతుడి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.