ధోనీ మీరనుకున్నంత కూల్ ఏమీ కాదు.. బూతులు తిడతాడు: ఇషాంత్‌శర్మ సంచలన వ్యాఖ్యలు
- ధోనీ అందరూ అనుకున్నంత కూల్ కాదన్న ఇషాంత్
- తాను కూడా ధోనీతో తిట్లు తిన్నానన్న వెటరన్ పేసర్
- ధోనీ జాబితాలో ‘కామ్ అండ్ కూల్’ లేవని వ్యాఖ్య
తానోసారి బౌలింగ్ పూర్తిచేశాక ధోనీ తన వద్దకు వచ్చి నువ్వు అలసిపోయావా? అని అడిగాడని, దానికి తాను అవును అని సమాధానమిస్తే.. వయసైపోయింది.. రిటైర్ అయిపోమని సలహా ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. ఒకసారి మహీభాయ్ విసిరిన త్రోను తాను అందుకోలేకపోయినందుకు తనపై కోపంగా చూశాడని, రెండోసారి బలంగా విసిరిన త్రోను కూడా పట్టకోలేకపోయానని పేర్కొన్నాడు. మూడోసారి వేసేటప్పుడు మాత్రం ఈసారి తలబాదుకో అని గట్టిగా అరిచాడంటూ ధోనీ కోపం గురించి వివరించాడు.