Kalyan Ram: కల్యాణ్ రామ్ 'డెవిల్' మూవీ గ్లింప్స్ రిలీజ్!

  • 1945 నాటి కాలంలో మొదలయ్యే కథ 
  • సీక్రెట్ ఏజెంట్ గా కనిపించనున్న హీరో 
  • హైలైట్ గా నిలవనున్న యాక్షన్ ఎపిసోడ్స్
  • హీరోయిన్స్ గా సంయుక్త మీనన్ - మాళవిక నాయర్
Devil Movie Special Glimse Released

కల్యాణ్ రామ్ నుంచి ఆ మధ్య వచ్చిన 'అమిగోస్' ఆశించిన స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఆ తరువాత ఆయన చేసిన 'డెవిల్' త్వరలో ప్రేక్షకులను పలకరించనుంది. 'ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్' అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో కల్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు.

అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజున కల్యాణ్ రామ్ బర్త్ డే కావడంతో, ఈ సినిమా నుంచి స్పెషల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. బ్రిటీష్ కాలంలో నడిచే కథకి సంబంధించిన సన్నివేశాలతో వదిలిన ఈ గ్లింప్స్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.   
 
 శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి కథను అందించాడు. 1945 ప్రాంతంలో ఈ కథ మొదలై .. ప్రస్తుత కాలానికి కనెక్ట్ అవుతుంది. ఈ కథలో వైవిధ్యభరితమైన పాయింట్ ఇదే. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో కథానాయికలుగా సంయుక్త మీనన్ - మాళవిక నాయర్ అలరించనున్నారు. 500 మంది ఫైటర్స్ తో చిత్రీకరించిన ఒక యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.

More Telugu News