బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం.. రక్షించి పోలీసులకు అప్పగించిన హిజ్రా

  • హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ఘటన
  • రోడ్డుపైకొచ్చి ఏడుస్తూ కూర్చున్న బాలికను రక్షించిన హిజ్రా
  • నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు
హైదరాబాద్ హయత్‌నగర్‌లో దారుణం జరిగింది. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు ఔటర్ రింగురోడ్డు సమీపంలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశారు. వారితో జరిగిన పెనుగులాటలో గాయపడిన బాలిక తప్పించుకుని రోడ్డుపైకి వచ్చి ఏడుస్తూ సాయం కోసం ఎదురుచూసింది.

అటుగా వెళ్తున్న ఓ హిజ్రా బాలికను చూసి దుండగుల బారి నుంచి రక్షించి పోలీసులకు అప్పగించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. బాధిత బాలికను ఆసుపత్రికి తరలించారు. 


Girl Kidnap
Hyderabad
Hayathnagar
Crime News

More Telugu News