వంగవీటి రంగా ఆశీస్సులు మాకు, ప్రజలందరికీ ఉండాలి: కొడాలి నాని

  • రంగా కులం కోసం కాకుండా ప్రజల కోసం పని చేశారన్న కొడాలి నాని
  • సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అని కితాబు
  • జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ నినాదం
వంగవీటి మోహనరంగా కులం కోసం కాకుండా ప్రజల కోసం పని చేశారని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని కొనియాడారు. విజయవాడ, కృష్ణా జిల్లా, కోస్తా జిల్లాల్లో ఆయన ముద్ర చెరపలేనిదని అన్నారు. పేద ప్రజలకు అండగా ఉన్నారని, తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించిన ఉన్నతమైన వ్యక్తి అని చెప్పారు.

రంగా మన మధ్య లేకపోయినా, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ఆశీస్సులు తమకు, ప్రజలకు అందరికీ ఉండాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. రంగా తనయుడు వంగవీటి రాధాకు ఉజ్వలమైనటువంటి రాజకీయ భవిష్యత్తు ఉండాలని, ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఆయనకు దేవుడు, రంగా ఇవ్వాలని కోరుకుంటున్నానని అన్నారు. జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ నినదించారు. రంగా 76వ జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడుతూ కొడాలి నాని పైవ్యాఖ్యలు చేశారు.

Kodali Nani
YSRCP
Vangaveeti Ranga

More Telugu News