చైనా వెళుతున్నారా..? మరోసారి ఆలోచించుకోండి.. తన పౌరులకు అడ్వైజరీ జారీ చేసిన అమెరికా
- తప్పుడు ఆరోపణలతో అరెస్టు చేసే అవకాశం ఉందని హెచ్చరిక
- ఆ దేశంలో డ్రగ్స్ జోలికి వెళ్లొద్దని సూచన
- నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలకు దూరంగా ఉండాలని హితవు
చైనా వెళ్లేముందు కానీ, చైనాలో ఉన్నపుడు కానీ డ్రగ్స్ తీసుకోవద్దని, చైనాలో జరిగే నిరసన ప్రదర్శనలలో పాల్గొనవద్దని అమెరికా తన పౌరులను హెచ్చరించింది. చైనాతో పాటు హాంగ్ కాంగ్, మకావూలలో పర్యటించే సమయంలోనూ జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అమెరికా గతంలోనూ చైనా పర్యటనకు వెళ్లే తన పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. అయితే, కొవిడ్ కారణంగా సడెన్ గా విధించే లాక్ డౌన్ ల గురించి, దీనివల్ల అక్కడే చిక్కుకుపోయే ప్రమాదం ఉందనే సూచనలు మాత్రమే ఉండేవి.