'బ్రో' నుంచి పవన్ ఫొటో లీక్ చేసిన దర్శకుడు
- బ్రో చిత్రంలో నటిస్తున్న పవన్ కల్యాణ్
- సముద్రఖని దర్శకత్వంలో చిత్రం
- క్లబ్ లో పవన్ కల్యాణ్... పిక్ ను పంచుకున్న సముద్రఖని
- ఈ నెల 28న వస్తున్న బ్రో
పవన్ కల్యాణ్ తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న బ్రో ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఇందులో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఈ చిత్రం జులై 28న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.