13వ సారి ‘శాఫ్’ ఫైనల్ కు దూసుకెళ్లిన భారత్
- సెమీ ఫైనల్లో లెబనాన్ షూటౌట్
- మరో సెమీస్ లో బంగ్లాదేశ్ పై కువైట్ గెలుపు
- మంగళవారం కువైట్ తో ఫైనల్లో తలపడనున్న ఛెత్రీసేన
లెబనాన్ నాలుగు ప్రయత్నాల్లో రెండు గోల్స్ మాత్రమే చేసి ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాడు హసన్ కొట్టిన తొలి కిక్‌ను భారత గోల్ కీపర్ అడ్డుకొన్నాడు. తర్వాత వలీద్ షోర్, సాదిక్ గోల్స్ చేశారు. నాలుగో కిక్‌ను ఖలీల్ బాదర్ బయటకు కొట్టడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరడం ఇది 13వసారి. మరో సెమీ ఫైనల్లో కువైట్ 1-0 తేడాతో బంగ్లాదేశ్ పై గెలిచింది. ఎల్లుండి జరిగే ఫైనల్లో భారత్, కువైట్ జట్లు పోటీ పడతాయి.