Nara Lokesh: టీడీపీ రాగానే వైసీపీ నేతల అవినీతిపై సిట్ వేయడం ఖాయం: లోకేశ్

  • గూడూరు నియోజకవర్గంలో ముగిసిన లోకేశ్ యువగళం
  • వరగలి గ్రామంలో రచ్చబండ
  • సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రవేశించిన లోకేశ్ పాదయాత్ర
  • యువనేతకు ఘనస్వాగతం పలికిన సోమిరెడ్డి, ఇతర టీడీపీ నేతలు 
Lokesh said they will order SIT probe on YCP leaders after TDP win

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 5 రోజుల పాటు సాగిన యువగళం పాదయాత్ర శుక్రవారం రాత్రి సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రవేశించింది. కృష్ణపట్నం దక్షిణ ద్వారం వద్ద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అడుగుపెట్టారు. 

మాజీమంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు అపూర్వ స్వాగతం పలికారు. 

అంతకుముందు, గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వరగలి నుంచి ప్రారంభమైన 142వ రోజు యువగళం పాదయాత్ర... విజయవంతంగా సాగింది. వరగలిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించిన లోకేశ్ అక్కడి ప్రజల సాధకబాధకాలు తెలుసుకున్నారు. 

వరగలి, లింగవరం, సింహపురి పవర్ ప్లాంట్, తమ్మినపట్నం, గుమ్మలదిబ్బ, కృష్ణపట్నం దక్షిణ ద్వారం మీదుగా గోపాలపురం విడిది కేంద్రానికి చేరుకుంది.

ప్రజల కష్టాలు తీర్చేందుకే భవిష్యత్తుకు గ్యారంటీ!

గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వరగలి గ్రామంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో లోకేశ్ గ్రామస్తులతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా లోకేశ్ స్పందిస్తూ... నాలుగేళ్ల జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, చెత్త పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలు, ఇంటి పన్ను పెంచి ప్రజల్ని పీడిస్తున్నాడని విమర్శించారు. మహిళల కష్టాలు చూసిన తరువాత టీడీపీ మహాశక్తి కార్యక్రమాన్ని ప్రకటించిందని వెల్లడించారు. 

"ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకి రూ.1500 ఇస్తాం. దీపం పథకం కింద ప్రతి ఏడాది మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. తల్లికి వందనం పేరుతో పిల్లల చదువు కోసం రూ.15 వేలు అందిస్తాం. ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు ఇస్తాం. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రతి నెలా నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందిస్తాం" అని హామీ ఇచ్చారు.

ఉచితంగా ఇళ్లు కట్టిస్తానని జగన్మోసం!

ఎన్నికల ముందు జగన్ ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తాం అని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఇళ్లు కట్టకపోతే స్థలం వెనక్కి లాక్కుంటున్నాడు. జగన్ ప్రభుత్వం మూడు లక్షల పట్టాలు వెనక్కి తీసుకుంది. వెయ్యి రూపాయల దివ్యాంగుల పెన్షన్ ని మూడు వేలు చేసింది చంద్రబాబునాయుడు. 

నాడు టీడీపీ ప్రభుత్వం స్కూటర్లు కూడా అందించింది. జగన్ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ ఇవ్వడం లేదు. కార్పొరేషన్ ద్వారా ఒక్క రూపాయి రుణం ఇవ్వలేదు. స్కూటర్లు కూడా ఇవ్వలేదు. రూ.200 వందల పెన్షన్ ని రూ. 2 వేలు చేసింది చంద్రబాబు గారు. జగన్ నాలుగేళ్లలో పెన్షన్ పెంచింది కేవలం రూ.750 మాత్రమే.

రౌడీల చుట్టూ రౌడీలే ఉంటారు!

రౌడీ చుట్టూ రౌడీలు ఉంటారు. 420ల చుట్టూ 420లు ఉంటారు. 28 కేసుల్లో ఏపీ సీఎం జగనే 420... ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు కూడా 420లే. గూడూరులో సిలికా శాండ్ దోచుకొని ప్రకృతిని విధ్వంసం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ నేతల అవినీతిపై సిట్ తో విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. వైసీపీ నేతలు దోచుకున్న సొమ్ము రికవరీ చేసి ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తాం.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన మొత్తం దూరం 1868.3 కి.మీ*

*ఈరోజు నడిచిన దూరం – 15.3 కి.మీ.*

*143వ రోజు పాదయాత్ర వివరాలు(1-7-2023)*

*సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, ( ఉమ్మడి నెల్లూరు జిల్లా)*

సాయంత్రం

4.00 – గోపాలపురం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

4.05 – గోపాలపురం జంక్షన్ లో స్థానికులతో సమావేశం.

4.15 – ముత్తుకూరులో మత్స్యకారులతో సమావేశం.

4.30 – ముత్తుకూరు జంక్షన్ లో బహిరంగసభ, యువనేత లోకేశ్ ప్రసంగం.

5.40 – ముత్తుకూరు బీసీ కాలనీలో స్థానికులతో మాటామంతీ.

6.10 – కుమ్మరిమిట్ట క్రాస్ వద్ద బీసీలతో సమావేశం.

6.20 – మల్లూరు రిలయన్స్ రోడ్డులో స్థానికులతో సమావేశం.

6.30 – మల్లూరులో స్థానికులతో సమావేశం.

6.45 – కప్పలదరువులో స్థానికులతో మాటామంతీ.

7.00 – తాళ్లపూడిలో స్థానికులతో సమావేశం.

7.40 – బ్రహ్మదేవిలో స్థానికులతో మాటామంతీ.

8.00 – పిడతపోలూరు జంక్షన్ లో స్థానికులతో మాటామంతీ.

8.10 – జంగాల కండ్రిగలో స్థానికులతో సమావేశం.

8.30 – రంగాచార్యుల కండ్రిగ క్రాస్ వద్ద యువతతో సమావేశం.

9.30 – వరిగొండ ముస్లింపేటలో స్థానికులతో సమావేశం.

9.40 – గుమ్మలపాలెం స్థానికులతో సమావేశం

9.50 – కాకుపల్లి జ్వాలాముఖి ఆర్చి వద్ద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశం.

10.00 – కాకుపల్లి శివారు విడిది కేంద్రంలో బస.

******

More Telugu News