Allari Naresh: ‘మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కథ’ .. అల్లరి నరేశ్ కొత్త సినిమా ప్రకటనే అదిరిందిగా!

  • నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాపై అప్‌డేట్
  • చిత్రాన్ని తెరకెక్కిస్తున్న దర్శకుడు సుబ్బు మంగదేవి
  • ఆసక్తికర వీడియోను రిలీజ్ చేసిన మేకర్స్
Naresh62 Announcement

‘ఉగ్రం’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లరి నరేశ్. అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఈరోజు నరేశ్ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాపై అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓ ఆసక్తికర వీడియోను రిలీజ్ చేశారు.

‘ఎన్62’ అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాను.. దర్శకుడు సుబ్బు మంగదేవి తెరకెక్కిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలో నరేశ్‌కు దర్శకుడు సుబ్బు మంగదేవి కథ వివరిస్తూ కనిపించారు. బార్‌‌లో కూర్చుని చెబుతున్నట్లుగా చూపించారు.

‘మూర్ఖత్వం బార్డర్ దాటిన ఒకడి జీవిత కథ’ ఈ సినిమా అని డైరెక్టర్ చెప్పారు. నిర్మాత సహా టెక్నీషియన్స్ అందరూ అక్కడే ఉన్నట్లు, వారికీ అక్కడే కథ వినిపించినట్లు ఆసక్తికరంగా వీడియో రూపొందించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నారు. ఇక హీరోయిన్, ఇతర నటీనటుల గురించిన సమాచారం త్వరలో వెల్లడి కానుంది.


More Telugu News