తిరుగులేని కబడ్డీ కూత.. ఎనిమిదోసారి ఆసియా చాంపియన్ గా భారత్
- ఫైనల్లో 42-32తో ఇరాన్ ను చిత్తు చేసిన భారత జట్టు
- సత్తా చాటిన కెప్టెన్ పవన్ సెహ్రావత్
- తొమ్మిది పర్యాయాల్లో ఎనిమిదిసార్లు టైటిల్ నెగ్గిన టీమిండియా
లీగ్ దశలో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ భారత్ గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇరాన్ రెండో స్థానంలో నిలిచి భారత్ తో ఫైనల్ కు అర్హత సాధించింది. ఈ టోర్నీలో తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్న భారత్ సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో పాల్గొననుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత్ సెమీఫైనల్లోనే ఓడింది. ఈసారి స్వర్ణం నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకుంది.