Uttar Pradesh: మంచంపై నోట్ల కట్టలతో భార్యాపిల్లల సెల్ఫీ.. చిక్కుల్లోపడ్డ పోలీసు అధికారి

UP cop in trouble after wife children take selfie with bundles of Rs 500 notes
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన, నెట్టింట్లో ఫొటో వైరల్
  • అంత డబ్బు పోలీసు అధికారికి ఎలా వచ్చిందో తేల్చేందుకు దర్యాప్తు ప్రారంభం
  • పోలీస్ లైన్స్‌కు అధికారి బదిలీ
  • అది వారసత్వ ఆస్తి అమ్మగా వచ్చిన డబ్బు అని పోలీసు అధికారి వివరణ
మంచంపై నోట్ల కట్టలతో తన భార్యాపిల్లలు దిగిన సెల్ఫీ ఓ పోలీసు అధికారిని చిక్కుల్లో పడేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పోలీస్ ఆఫీసర్ రమేశ్ చంద్ర సహానీ భార్యాపిల్లలు మంచంపై నోట్ల కట్టలతో దిగిన సెల్ఫీ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ సొమ్ము మొత్తం రూ.14 లక్షలు అని సమాచారం. అంతడబ్బు సహానీకి ఎక్కడి నుంచి వచ్చిందో తేల్చేందుకు సిద్ధమైన ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. అంతేకాకుండా, సహానీని పోలీస్ లైన్స్‌కు బదిలీ చేశారు. 

ఈ మొత్తం ఉదంతంలో తన తప్పేమీ లేదని సహానీ మీడియాకు స్పష్టం చేశారు. అది తన వారసత్వ ఆస్తిని అమ్మగా వచ్చిన డబ్బు అని స్పష్టం చేశారు. అది ఎప్పుడో 2014లో తీసిన ఫొటో అని వివరించే ప్రయత్నం చేశారు.
Uttar Pradesh
Crime News

More Telugu News