Revanth Reddy: కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం ఇదే.. దోచుకున్న సొమ్ముతో చివరకు అక్కడికే వెళ్తారు: రేవంత్ రెడ్డి

KCR will go to Dubai with corruption money says Revanth Reddy
  • కేసీఆర్ కుర్చీ కదులుతోందనే భయంతో కేటీఆర్ ఢిల్లీలో ప్రదక్షిణలు చేస్తున్నారన్న రేవంత్
  • ఢిల్లీ బీజేపీ పెద్దలు, కేసీఆర్ ఒక్కటేనని వ్యాఖ్య
  • కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అన్న రేవంత్
ముఖ్యమంత్రి కేసీఆర్ కుర్చీ కదులుతోందనే భయంతోనే కేటీఆర్ ఢిల్లీలో గల్లీగల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమో, మెట్రో రైలు కోసమో, కంటోన్మెంట్ రోడ్ల కోసమో కేటీఆర్ ఢిల్లీకి వెళ్లడం లేదని విమర్శించారు. కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడులు జరుగుతాయనే భయంతో వెళ్తున్నారని చెప్పారు. ఇటీవల జరిగిన ఐటీ దాడుల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులకు చెందిన రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని తెలిపారు. ఐటీ దాడుల్లో దొరికిన ఆస్తులను కాపాడుకోవడానికి ప్రధాని మోదీకి కేసీఆర్ లొంగిపోయారని ఆరోపించారు. 

పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని రేవంత్ అన్నారు. రూ. 100 కోట్ల ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ పై విచారణ జరిపిస్తున్న మోదీ... లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ పై ఎందుకు విచారణ జరిపించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని... ఈ విషయాన్ని రాష్ట్ర బీజేపీ నేతలు గుర్తించాలని, భ్రమల్లో నుంచి బయటకు రావాలని సూచించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలు, ఇక్కడ ఉన్న కేసీఆర్ ఇద్దరూ ఒక్కటేనని అన్నారు. కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని... దోచుకున్న సొమ్ముతో చివరకు అక్కడికే వెళ్తారని చెప్పారు. 

Revanth Reddy
Congress
KCR
KTR
BRS

More Telugu News