China: కరోనా వైరస్‌ చైనా సృష్టే.. సంచలన విషయాలు వెల్లడించిన వుహాన్ శాస్త్రవేత్త

  • వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లోనే వైరస్‌కు పురుడు
  • నాలుగు రకాల స్ట్రెయిన్లలో వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించే పని అప్పగించిన ఉన్నతాధికారి
  • 2019 వరల్డ్ మిలటరీ గేమ్స్‌ ద్వారా వ్యాప్తికి యత్నం
  • ఆ తర్వాత వుయిగర్ ముస్లింలపైనా ప్రయోగం
  • సంచలన విషయాలు వెల్లడించిన వుహాన్ రీసెర్చర్  
  • జీవాయుధంగా ఉపయోగించేందుకు ఉద్దేశపూర్వకంగా సృష్టి 
China Deliberately Engineered Coronavirus As Bioweapon Wuhan Researcher Revealed

మొత్తానికి కరోనా వైరస్ సహజంగా పుట్టినది కాదన్న విషయం బహిర్గతమైంది. వైరస్‌ చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందని వైరాలజీ ఇనిస్టిట్యూట్ పరిశోధకుడు చావోషావ్ వెల్లడించాడు. ఇంటర్నేషనల్ ప్రెస్ అసోసియేషన్ సభ్యురాలు, హక్కుల కార్యకర్త జెన్నిఫర్ ఝెంగ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ సంచలన విషయాన్ని వెల్లడించారు. 

పై అధికారి ఒకరు తమకు నాలుగు రకాల కరోనా వైరస్‌లను ఇచ్చి అందులో అత్యంత వేగంగా వ్యాప్తి చెందే దానిని గుర్తించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. 2019లో వుహాన్‌లో జరిగిన మిలిటరీ వరల్డ్ గేమ్స్ సమయంలో తమ సహచరులు చాలామంది అదృశ్యమయ్యారని పేర్కొన్న షావో.. క్రీడాకారులు బస చేసిన హోటళ్లలో వారి ఆరోగ్యం, అక్కడి పరిశుభ్రతను పరిశీలించేందుకు వారిని పంపినట్టు తర్వాత తెలిసిందన్నారు. కరోనా వైరస్‌ను షావో జీవాయుధంగా అభివర్ణించారు. ఉద్దేశపూర్వకంగానే దీనిని సృష్టించినట్టు ఆయన పేర్కొన్నారు.

నిజానికి ఆ పనికి వైద్యులు సరిపోతారని, వైరాలజిస్టులతో పనిలేదని పేర్కొన్నారు. తనకు అప్పుడే అనుమానం వచ్చిందని,  వైరస్‌ను అక్కడ వ్యాప్తి చేసేందుకే వారిని పంపి ఉంటారని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత ఏడాది జింగ్‌జియాంగ్‌లోని రీ ఎడ్యుకేషన్ శిబిరాల్లో ఉన్న వుయిగర్ల ఆరోగ్యాన్ని పరీక్షించాలంటూ వైరాలజిస్టులను పంపడంతో అనుమానం మరింత బలపడిందన్నారు. వైరస్‌ను వ్యాపింపజేయడమో, లేదంటే మానవులపై వైరస్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకో అక్కడికి పంపి ఉంటారని ఆయన వివరించారు. షావో ఇంటర్వ్యూ వివరాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది.

More Telugu News