Group-1: తెలంగాణ గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీ విడుదల

  • గతేడాది 503 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్
  • ప్రిలిమ్స్ కు 2.85 లక్షల మంది హాజరు
  • ఓఎంఆర్ షీట్లను వెబ్ సైట్ లో ఉంచిన టీఎస్ పీఎస్సీ
Telangana group 1 key released

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించడం తెలిసిందే. తాజాగా, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ విడుదల చేశారు. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను టీఎస్ పీఎస్సీ వెబ్ సైట్ లో ఉంచింది. 

గ్రూప్-1కు సంబంధించి 503 పోస్టులతో టీఎస్ పీఎస్సీ గతేడాది నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 3.80 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 2.85 లక్షల మంది ప్రిలిమ్స్ రాశారు. త్వరలోనే ఫలితాలు వెల్లడించనున్నారు.

More Telugu News