AAP: ఉమ్మడి పౌర స్మృతికి ఆప్ ‘సూత్రప్రాయ‘ మద్దతు!

  • ఆప్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ కీలక వ్యాఖ్య
  • ఈ అంశంపై విస్తృత స్థాయిలో సమాలోచనలు జరపాలని సూచన
  • ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలన్న సీనియర్ నేత
AAPs In Principle  Support For Uniform Civil Code

ఉమ్మడి పౌర స్మృతికి తమ పార్టీ సూత్రప్రాయ మద్దతు తెలుపుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ తాజాగా పేర్కొన్నారు. అయితే, ఈ అంశంతో ముడిపడి ఉన్న అన్ని వర్గాలతో విస్తృతమైన సంప్రదింపులు జరిపాకే ముందుడగు వేయాలన్నారు. ఏకాభిప్రాయం కోసం కృషి చేయాలని సూచించారు. 

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఉమ్మడి పౌర స్మృతి అంశం తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఒక దేశంలో రెండు చట్టాలు ఎందుకని సాక్షాత్తూ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆప్ నేత వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

అయితే, ప్రధాని వ్యాఖ్యలపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చీలికలు పెద్దవవుతాయని హెచ్చరించింది.  ఆధిపత్య భావజాలంతో తనదైన ఎంజెడాతో ముందుకెళుతున్న ప్రభుత్వం ప్రజలపై ఉమ్మడి పౌర స్మృతిని  బలవంతంగా రుద్దకూడదని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం వ్యాఖ్యానించారు. కాగా, ముస్లిం మత సంస్థలు కూడా ఈ అంశంపై చర్చలు ప్రారంభించాయి. రోడ్డెక్కి నిరసనలకు దిగొద్దంటూ ముస్లింలకు జమైత్ ఉలేమా ఏ హింద్ బోర్డు సభ్యుడు అర్షద్ మద్ని విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News