Stock Market: విదేశీ పెట్టుబడుల వెల్లువ.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 499 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
  • 155 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • 2.33 శాతం లాభపడ్డ టాటా మోటార్స్ షేరు విలువ 
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 499 పాయింట్లు లాభపడి 63,915కి ఎగబాకింది. నిఫ్టీ 155 పాయింట్లు పుంజుకుని 18,972కి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్లలో భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో సూచీలు పరుగులు పెడుతున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం కూడా మార్కెట్లపై ప్రభావం చూపుతోంది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టాటా మోటార్స్ (2.33%), సన్ ఫార్మా (2.13%), టైటాన్ (1.86%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.56%), ఎల్ అండ్ టీ (1.47%).

టాప్ లూజర్స్:
టెక్ మహీంద్రా (-0.95%), మహీంద్రా అండ్ మహీంద్రా (-0.25%), కొటక్ బ్యాంక్ (-0.23%), బజాజ్ ఫిన్ సర్వ్ (-0.16%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-0.04%).

More Telugu News