'సైంధవ్'ను దాటి వెళ్లలేని విలన్ గ్యాంగ్: షూటింగ్ అప్ డేట్!
- వెంకీ తాజా చిత్రంగా 'సైంధవ్'
- పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచిన సినిమా
- ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ మూవీ
- ప్రతినాయకుడిగా నవాజుద్దీన్ సిద్ధికీ
ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్, కథానాయికగా నటిస్తున్న శ్రద్ధా శ్రీనాథ్ వలన బయటికి వచ్చింది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగు హైదరాబాదులో జరిగిందనీ, సక్సెస్ ఫుల్ గా ఈ షెడ్యూల్ ను పూర్తి చేయడం జరిగిందని అంది. దాంతో ఈ సినిమా టీమ్ మూడో షెడ్యూల్ కి రెడీ అవుతుందనే విషయం అర్థమవుతోంది.
సంతోష్ నారాయణ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నవాజుద్దీన్ సిద్ధికీ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, రుహాని శర్మ .. ఆండ్రియా ఇతర ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.