Tamannaah: అభిమాని చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా

  • ముంబై ఎయిర్‌‌పోర్టులో ఫ్యాన్స్‌తో ముచ్చటించిన తమన్నా
  • ఆమె పాదాలను తాకి.. లేఖను ఇచ్చిన వీరాభిమాని
  • అతడి చేతిపై వేయించుకున్న పచ్చబొట్టును చూసి తమన్నా భావోద్వేగం
tamannaah got emotional after seeing her tattoo on fans hand

అభిమానానికి హద్దులుండవు.. సినీ నటుల విషయంలో ఇది కాస్త ఎక్కువ ఉంటుంది. గుండెల్లో పెట్టుకునే వాళ్లు కొందరైతే.. గుడులు కట్టే వాళ్లు ఇంకొందరు..! గుండెలపై పచ్చబొట్టు పొడిపించుకునేవాళ్లు ఇంకొందరు. ఇలా ఓ వీరాభిమాని చేసిన పనికి మిల్కీ బ్యూటీ తమన్నా కన్నీళ్లు పెట్టుకుంది.

తాజాగా ముంబై విమానాశ్రయంలో తమన్నా కనిపించింది. దీంతో ఆమెను చూడటానికి చాలా మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన అభిమానులతో ముచ్చటించింది తమన్నా.

అందులో ఒక ఫ్యాన్ తమన్నా పాదాలను తాకి.. దండం పెట్టాడు. తర్వాత ఒక బొకే, లేఖను తన అభిమాన హీరోయిన్‌కు ఇచ్చాడు. ఈ సమయంలో తన చేతిపై వేయించుకున్న పచ్చబొట్టు చూపించాడు. అది చూసిన తమన్నా ఒక్కసారిగా భావోద్వేగానికి గురైంది.

తమన్నా ఫొటోతోపాటు ‘లవ్ యు తమన్నా’ అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. అది చూసి కన్నీళ్లు పెట్టుకున్న తమన్నా..  ఆ అభిమానిని కౌగిలించుకుని ‘ధన్యవాదాలు’ చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More Telugu News