Muralli Mohan: నా గురించి పేపర్లో అలా రాయడంతో, ఆ నిర్మాత మందలించాడు: మురళీమోహన్

Murali Mohan Interview
  • ఒక తమిళ పేపర్ తన గురించి అలా రాసిందన్న మురళీమోహన్
  • ఇండస్ట్రీలో ఆ వార్త గుప్పుమందని వెల్లడి  
  • ఈ విషయంలో తనని ఆ నిర్మాత మందలించారని వ్యాఖ్య 
  • తన భార్యాబిడ్డలు నమ్మలేదని వివరణ
నటుడిగా మురళీమోహన్ సుదీర్ఘమైన కెరియర్ ను కొనసాగించారు. తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, "అప్పట్లో ఇండస్ట్రీ ఇంకా మద్రాసులోనే ఉంది. ఒక రోజున నేను షూటింగుకి వెళితే, 'అతనేరా మురళీ మోహన్' అని లైట్ బాయ్స్ చెప్పుకుంటున్నారు. నాకు కారణం తెలియలేదు. అంతలో ఆ సినిమా హీరోయిన్ నా దగ్గరికి వచ్చి, 'మీరు జయచిత్రను పెళ్లి చేసుకుంటున్నారట గదా .. పేపర్లో వచ్చింది' అని చెప్పింది. తమిళ పేపర్లు చదవను కనుక నాకు తెలియలేదు.

అదే సమయంలో నా మొదటి సినిమా నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుగారు నాకు కాల్ చేశారు. నేను ఆయనను గురువుగా భావిస్తూ ఉంటాను. ఎక్కడున్నావ్ అని అడిగితే వాహినీ స్టూడియోలో అని చెప్పాను. తాను బయల్దేరి వస్తున్నట్టుగా చెప్పడంతో, నాకు టెన్షన్ పట్టుకుంది. పేపర్లో వచ్చింది చూసి ఉంటాడా? అని అనుకుంటూనే ఉన్నాను.  

'కొంతసేపటి తరువాత ఆయన వచ్చారు. 'బాబూ నీ గురించి నాకు తెలుసు. కానీ ఆకర్షణలో పడి ఏమైనా తప్పు చేస్తావేమోనని హెచ్చరించడానికి వచ్చాను. ఇవాళ పేపర్లో వచ్చింది గదా .. ఆ విషయం గురించి మాట్లాడుతున్నాను .. ఇలాంటి పిచ్చిపనులు చేయవద్దు' అన్నారు. ఆయనకి చెడ్డపేరు తీసుకొచ్చే ఏ పనీ చేయనని అన్నాను. అయితే పేపర్లో వచ్చిన ఈ వార్తను నా భార్యాబిడ్డలు నమ్మకపోవడం నాకు గర్వంగా అనిపించింది" అని చెప్పుకొచ్చారు.

Muralli Mohan
Jayachitra
Tollywood

More Telugu News