కుటుంబంతో కలసి తమిళనాడులో రాజమౌళి పర్యటన
- ఆయన వెంట భార్య, కుమారుడు, కోడలు, కుమార్తె
- ట్యూటికోరిన్ ప్రాంతంలో రిసార్ట్ లో బస
- గుర్తుగా ఓ మొక్కను నాటిన దర్శకుడు
ఆక్వా అవుట్ బ్యాక్ అనే ప్రముఖ వాటర్ స్పోర్ట్స్ కేంద్రం వద్ద విడిది చేశారు. రాజమౌళి కుటుంబం పర్యటన ఫొటోలను సదరు రీసార్ట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. తమ పర్యటనకు గుర్తుగా రాజమౌళి ఓ మొక్కను నాటారు. తిరిగి మరోసారి అక్కడకు వెళతామంటూ ఎస్ ఎస్ కార్తికేయ ప్రకటించారు. ఎస్ఎస్ రాజమౌళి సర్, రమా ఆంటీకి ఈ వారాంతంలో విడిది కల్పించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నానంటూ వీరికి ఆతిథ్యం ఇచ్చిన అనైనా అనే యువతి ఇన్ స్టా గ్రామ్ లో పేర్కొనడం గమనార్హం.