Pawan Kalyan: స్వల్ప అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్.. ఫంక్షన్ హాలులో విశ్రాంతి

Janasena Chief Pawan Fell ill in Varahi Yatra
  • పశ్చిమ గోదావరిలో వారాహి యాత్రలో ఉన్న పవన్
  • ఉపవాస దీక్షలో ఉండడంతో నీరసం
  • భీమవరం నేతలతో భేటీ మధ్యాహ్నానికి వాయిదా

వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్ నీరసంగా ఉండడంతోనే అనారోగ్యానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు భీమవరం నియోజకవర్గ నేతలతో నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేశారు. మధ్యాహ్నం తర్వాత భేటీ జరిగే అవకాశం ఉంది. కాగా, పలు పార్టీలకు చెందిన నేతలు నేడు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.

  • Loading...

More Telugu News