Nikhil: ఈ వారం థియేటర్స్ కి వస్తున్న సినిమాలివే!

  • ఈ నెల 29వ తేదీన నిఖిల్ 'స్పై' 
  • ఐదు భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా 
  • అదే రోజున శ్రీవిష్ణు 'సామజ వర గమన' విడుదల
  • 30వ తేదీన రానున్న 'లవ్ యూ రామ్'
  • అదే రోజున వస్తున్న మరో రెండు సినిమాలు
New Movies Update

ఈ వారంలో 29వ తేదీన రెండు సినిమాలు థియేటర్ కి వస్తుంటే, 30వ తేదీన 3 సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ నెల 29వ తేదీన (గురువారం) 'స్పై' సినిమా విడుదల కానుంది. నిఖిల్ - ఐశ్వర్య మీనన్ .. సన్యా ఠాకూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించాడు. నేతాజీ డెత్ మిస్టరీ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. ఇక అదే రోజున శ్రీవిష్ణు సినిమా 'సామజ వర గమన' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆయన సరసన నాయికగా రెబా మోనిక జాన్ నటించిన ఈ సినిమాను, రాజేశ్ దండా నిర్మించగా, రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. కామెడీ ప్రధానంగా నడిచే కథ ఇది. 30వ తేదీన (శుక్రవారం) 'లవ్ యూ రామ్' ప్రేక్షకులను పలకరించనుంది. దశరథ్ నిర్మాణంలో డీవై చౌదరి రూపొందించిన సినిమా ఇది.  పాయల్ - విరాజ్ అశ్విన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'మాయా పేటిక' కూడా ఈ నెల 30వ తేదీనే థియేటర్లకు రానుంది. సునీల్ .. రజిత్ రాఘవ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఒక స్మార్ట్ ఫోన్ చుట్టూ తిరగనుంది. చంద్రారెడ్డి నిర్మించిన ఈ సినిమాకి రమేశ్ దర్శకత్వం వహించాడు. ఇక సుధాకర్ - యామిని జంటగా నటించిన 'నారాయణ అండ్ కో' సినిమా కూడా ఇదే రోజున విడుదల కానుంది.

More Telugu News