Jagan: సీఎం జగన్ తో అనిల్ కుమార్ యాదవ్ భేటీ... నెల్లూరు విభేదాలపై చర్చ!

  • ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు
  • ఇప్పటికే పార్టీకి దూరమైన ముగ్గురు ఎమ్మెల్యేలు
  • నెల్లూరు సిటీ వైసీపీలోనూ విభేదాలంటూ ప్రచారం
  • పరిస్థితులను సీఎం జగన్ కు వివరించిన మాజీ మంత్రి అనిల్ కుమార్
Anil Kumar Yadav met CM Jagan

రాష్ట్రంలో మరే జిల్లాలో లేనంతగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో విభేదాలు నెలకొన్నాయి. కొందరు నేతలకు ఒకరంటే ఒకరికి పడకపోవడంతో విభేదాలు ముదిరి రచ్చకెక్కాయి. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరమయ్యారు. నెల్లూరు సిటీలోనూ లుకలుకలు ఉన్నాయన్న వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో, మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ సీఎం జగన్ తో సమావేశమయ్యారు. 

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన అనిల్ కుమార్ దాదాపు 45 నిమిషాల పాటు సీఎం జగన్ తో వివిధ అంశాలపై చర్చించారు. నెల్లూరు సిటీలో, జిల్లాలో పార్టీ బలంగా ఉందని, విజయంపై సందేహాలు అక్కర్లేదని అనిల్ కుమార్ సీఎంకు వివరించారు. పార్టీ నేతల మధ్య విభేదాలపై అనిల్ నుంచి సీఎం జగన్ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. 

పార్టీ నేతలు సమైక్యంగా ముందుకు నడవాలని, పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని సీఎం జగన్ మాజీ మంత్రి అనిల్ కు నిర్దేశించారు. 

అదే సమయంలో, తన నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని అనిల్ కుమార్ కోరగా, సీఎం జగన్ వెంటనే స్పందించి, నిధులు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించినట్టు తెలుస్తోంది.

More Telugu News