విమానంలో క్యాండీ క్రష్ ఆడిన ధోనీ.. అమాంతం పెరిగిపోయిన డౌన్ లోడ్స్!
- ఇండిగో విమానంలో ధోనీ క్యాండీ ఆడిన వీడియో నెట్టింట వైరల్
- ఎయిర్ హోస్టెస్ చాక్లెట్స్ తీసుకు వచ్చాక నవ్వుతూ తీసుకున్న ధోనీ
- ఆ సమయంలో పక్కనే భార్య సాక్షి
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో వైరల్ గా మారిన తర్వాత క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్స్ భారీగా పెరిగాయట. ఈ వీడియో వైరల్ గా మారడంతో క్యాండీ క్రష్ యాప్ మూడు గంటల్లోనే 3.6 మిలియన్ల డౌన్ లోడ్స్ అయ్యాయట. ధోనీ వీడియోను లక్షలాది మంది చూస్తున్నారు. క్యాండీ క్రష్ పెద్ద ఎత్తున డౌన్ లోడ్ అవుతోందని, ఇందుకు ధోనీకి థ్యాంక్స్ అంటూ ఓ నెటిజన్ సరదాగా పేర్కొన్నాడు.