Farmers: పంటలను కాపాడుకునేందుకు యూపీ రైతుల కొత్త ఐడియా

  • యూపీలోని లఖింపూర్ ఖేరీ గ్రామంలో కోతుల బెడద
  • పంటలకు నష్టం కలిగిస్తుండడంతో పరిష్కారంపై దృష్టి
  • ఎలుగుబంటి మాదిరి కాస్ట్యూమ్ ధరించడంతో తొలగిన సమస్య
Farmers in UP dress up as bear to protect crops from monkeys

ఒక్క ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుందనే ప్రకటన చూసే ఉంటారు. ఉత్తరప్రదేశ్ లో గ్రామ రైతులు ఇదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. పంట భూమిలోకి కోతులు తరచూ ప్రవేశిస్తూ నష్టం కలిగిస్తుండడంతో మార్గం ఏంటా? అని ఆలోచించారు. కోతులను భయపెట్టే మార్గం కోసం ఆలోచించారు. చివరికి ఎలుగుబంటి ఆలోచన తట్టింది. ఎలుగుబంటి మాదిరిగా కనిపించేందుకు డ్రెస్ కొనుగోలు చేశారు.

దాన్ని ధరించి తమ పంట పొలంలో పగలంతా నించునేవారు. ఆ డ్రెస్ ధరించి, అచ్చం ఎలుగుబంటి మాదిరిగా ఉండడంతో కోతులు భయంతో అటు వైపు రావడానికి సాహసం చేయలేదు. యూపీలోని లఖింపూర్ ఖేరీ ప్రాతంలో ఇది జరిగింది. గ్రామంలో కోతుల బెడద, వాటివల్ల పంటలకు జరుగుతున్న నష్టంపై రైతులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో చివరికి గ్రామంలోని రైతులు అందరూ ఎలుగుబంటి కాస్ట్యూమ్ కొనుగోలు చేశారు. వాటిని ధరించి తమ తమ పంట పొలాల్లో నించోవడం మొదలు పెట్టిన తర్వాత కోతుల బెడద తగ్గిపోయింది.

More Telugu News