Prabhas: షూటింగ్‌లో గాయపడ్డ ‘సలార్’ విలన్‌‌కు నేడు సర్జరీ

Hero Prithviraj who was injured during shooting to go under knife today
  • ‘విలాయత్ బుద్ధ’ సినిమా షూటింగ్‌లో హీరో పృథ్వీరాజ్‌కు ప్రమాదం
  • బస్సులో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జారి పడ్డ నటుడు, కాలికి గాయం
  • కొచ్చిలోని ఓ ఆసుపత్రిలో పృథ్వీరాజ్‌కు చికిత్స, నేడు కాలి ఆపరేషన్
  • ఆపరేషన్ తరువాత మూడు నెలల పాటు రెస్ట్ తీసుకునే అవకాశం
‘విలాయాత్ బుద్ధ’ సినిమా షూటింగ్ సందర్భంగా గాయపడ్డ మలయాళ నటుడు పృథ్వీరాజ్‌కు నేడు సర్జరీ జరగనుంది. కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన కాలికి వైద్యులు ఆపరేషన్ చేయనున్నారు. అయితే, శస్త్రచికిత్స తరువాత ఆయన మూడు నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వుంటుందని సమాచారం. 

‘విలాయత్ బుద్ధ’ సినిమా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో ఇటీవల పృథ్వీరాజ్‌కు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో ఫైటింగ్ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా జారి పడటంతో ఆయన కాలికి గాయమైంది. వెంటనే ఆయనను చికిత్స కోసం కొచ్చిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మరయూర్‌లో గంధపు చెక్కల వెలికితీతకు సంబంధించిన కథతో విలాయత్ బుద్ధను తెరకెక్కిస్తున్నారు. అదే ప్రాంతంలో కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సలార్ సినిమాలో పృథ్వీరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సిద్ధమవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్‌‌ను మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేశారు.
Prabhas
PrithviRaj
Kerala
Salaar

More Telugu News