Kedarnath: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు... నిలిచిన కేదార్ నాథ్ యాత్ర

  • ఉత్తరాఖండ్ పై నైరుతి రుతుపవనాల ప్రభావం 
  • రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు
  • కొండచరియలు విరిగిపడి మూసుకుపోయిన రోడ్లు
  • సోన్ ప్రయాగ్ వద్ద కేదార్ నాథ్ భక్తులను ఆపేసిన అధికారులు
Kedarnath yatra halted as heavy rains lashes Uttarakhand

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తరాఖండ్ లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని పరిస్థితులను సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. 

ప్రముఖ పుణ్యక్షేత్రం కేదార్ నాథ్ వద్ద కూడా భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, కేదార్ నాథ్ యాత్రను నిలిపివేశారు. గౌరీ కుండ్ నుంచి కేదార్ నాథ్ వరకు విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సోన్ ప్రయాగ్ నుంచి బయల్దేరిన భక్తులు ఆగిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. 

నేటి ఉదయం 8 గంటల వరకు సోన్ ప్రయాగ్ నుంచి 5,828 మంది భక్తులు కేదార్ నాథ్ బయల్దేరారు. అయితే వీరు ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించలేదు. రానున్న 24 గంటల్లో ఉత్తరాఖండ్ లోని 7 జిల్లాలకు వాతావరణ సంస్థ భారీ నుంచి అతి భారీ వర్ష సూచన జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో, కేదార్ నాథ్ వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

More Telugu News