West Bengal: గూడ్సు రైలును వెనకనుంచి ఢీకొట్టిన మరో రైలు.. పట్టాలు తప్పిన బోగీలు

Two Good Trains Collide In West Bengal
  • పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో ఘటన
  • పట్టాలు తప్పిన 12 బోగీలు
  • ఓ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
పశ్చిమ బెంగాల్‌లోని బంకురాలో రెండు గూడ్సు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. వండా స్టేషన్‌లో ఓ రైలును మరో రైలు వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ గూడ్సు రైలు డ్రైవరుకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గూడ్సు రైళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే, రైళ్లు రెండూ ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయన్న విషయంలో స్పష్టత లేదు.

ప్రమాదంతో అడ్రా డివిజన్‌లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలు తప్పిన బోగీలను తొలగించి రైళ్ల రాకపోకలను పునరుద్ధరించే పనులు చేపట్టారు. కాగా, ఈ నెల 2న ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటనలో దాదాపు 292 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని అతిపెద్ద రైలు ప్రమాదాల్లో ఒకటిగా ఇది మిగిలిపోయింది.
West Bengal
Bankura
Goods Train
Train Collide

More Telugu News