Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్సార్ మరణంతో మొదలయ్యే ‘వ్యూహం’.. ఇదిగో టీజర్!

RAMGOPAL VARMAS VYOOHAM MOVIE TEASER REALESED
Advertisement
  • 2009‌‌ – 2014 మధ్య జరిగిన ఘటనలతో ‘వ్యూహం’

  • రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంతో మొదలైన టీజర్‌

  • 2.46 నిమిషాల టీజర్ లో ఒకే ఒక్క డైలాగ్

Advertisement

ఏపీ రాజకీయాల నేపథ్యంతో 'వ్యూహం', 'శపథం' అనే సినిమాలను టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ‘వ్యూహం’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఆయన ఇటీవల ప్రకటించారు. అందులో భాగంగానే ఈ రోజు వ్యూహం టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంతో టీజర్‌ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాతి నుంచి జగన్ సీఎం అయ్యే వరకు జరిగిన పరిణామాలను ఒక్కొక్కటిగా టీజర్ లో ప్రస్తావించారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఆ సమయంలో ఏపీ రాజకీయాల్లో ఏమేం జరిగాయి? అరెస్టులు, కొత్తగా పార్టీ పెట్టడం, జగన్ ఎదుర్కొన్న పరిస్థితులు తదితర అంశాలను ప్రస్తావిస్తూ టీజర్‌ సాగింది.

2.46 నిమిషాల టీజర్లో ఒకే ఒక్క డైలాగ్‌ మాత్రమే ఉంది. ‘అలా ఆలోచించడానికి చంద్రబాబుని కాదు’ అనే డైలాగ్ తో టీజర్ ని ముగించారు. ఈ చిత్రంలో సీఎం జగన్‌గా అజ్మల్‌, భారతిగా మానస నటించారు. రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Advertisement
Advertisement
RGV
VYOOHAM
RAMGOPAL VARMA
Jagan
YSR

More Telugu News