కరోనా మూలాలు వుహాన్ ల్యాబ్‌లోనే ఉన్నాయనడానికి ఆధారాల్లేవు: అమెరికా నిఘా విభాగం నివేదిక
- కచ్చితమైన ఆధారాలను గుర్తించలేకపోయామన్న అమెరికా నిఘా విభాగాలు
- కరోనాపై వుహాన్ ల్యాబ్‌లో విస్తృత పరిశోధనలు నిజమేనన్న యూఎస్ ఏజెన్సీలు
- వైరస్ ల్యాబ్‌లో పుట్టిందా? సహజంగా ఉద్భవించిందా? అన్నది పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని స్పష్టీకరణ
మహమ్మారి కచ్చితమైన మూలాన్ని కేంద్ర నిఘా విభాగంతోపాటు మరో ఏజెన్సీ కూడా గుర్తించలేకపోయిందని వోడీఎన్ఐ తెలిపింది. కరోనా వైరస్ సహజంగా పుట్టిందా? ల్యాబ్‌లో తయారైందా? అన్నది పలు విషయాలపై ఆధారపడి ఉంటుందని వివరించింది. కరోనాపై వుహాన్ ఇనిస్టిట్యూట్ (డబ్ల్యూఐవీ) విస్తృతంగా పనిచేసినప్పటికీ అమెరికా ఏజెన్సీలు మాత్రం మహమ్మారి మూలాలకు సంబంధించిన ఆధారాలను కనుగొనలేకపోయాయని నివేదికలో వివరించింది.