జనసేనకు ఊరట.. గ్లాసు గుర్తు కొనసాగింపు!
- ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు గాజు గ్లాసుతోనే జనసేన
- రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన
- ఏపీఎస్ఈసీ వద్ద బీఆర్ఎస్ రిజిస్టర్ చేసుకుంటే కారు గుర్తు కొనసాగింపు
గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో ఉన్న ఆర్ఎల్డీని రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో చేర్చినప్పటికీ దానికి గుర్తును రిజర్వు చేయలేదు. ఇక, కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో ఉండేది. ఆ పార్టీ కొత్త పేరు, వివరాలతో ఏపీఎస్ఈసీ వద్ద రిజిస్టర్ చేసుకుంటే ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో చేర్చి కారు గుర్తు కొనసాగించనుంది.