36 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
- ట్రాక్ మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా రద్దు
- నేటి నుంచి వచ్చే నెల 2 వరకు వివిధ రైళ్ల రద్దు
- ప్రయాణికులు సహకరించాలన్న రైల్వే
కరీంనగర్ నుంచి నిజామాబాద్, సిర్పూరు టౌన్ మధ్య నడిచే రైళ్లను ఎల్లుండి నుంచి జులై 3 వరకు రద్దు చేశారు. కాజీపేట నుంచి డోర్నకల్, భద్రాచలం-విజయవాడ, సికింద్రాబాద్ నుంచి వికారాబాద్, వరంగల్ ప్యాసెంజర్ రైళ్లను ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వేకు సహకరించాలని కోరారు.