KP Chowdary: నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుగొలిపే అంశాలు.. బిగ్ బాస్ కంటెస్టెంట్ తో వందల కాల్స్!

Police questions producer KP Chowdary in drugs case
షార్ట్స్‌లో చూడండి
డ్రగ్స్ కేసులో అరెస్టయిన టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తుగొలిపే అంశాలు వెల్లడయ్యాయి. ఇటీవల కేపీ చౌదరిని అరెస్ట్ చేయడం తెలిసిందే. కొద్దిమొత్తంలో కొకైన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. కోర్టు అనుమతితో అతడిని రెండ్రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించారు. పోలీసుల కస్టడీలో అనేక అంశాలు బయటికి వచ్చినట్టు తెలిసింది. 

ముఖ్యంగా, కేపీ చౌదరి బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న ఓ నటితోనూ, మరో ఐటం సాంగుల నటితోనూ వందల సంఖ్యలో ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు. విచారణ సమయంలో ఈ కాల్స్ పై అతడు మౌనం వహించాడు. కేపీ చౌదరి నుంచి డ్రగ్స్ అందుకునే ఖాతాదారుల్లో సెలెబ్రిటీలు కూడా ఉన్నట్టు వెల్లడైంది. 

కాగా, కేపీ చౌదరి బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు పరిశీలించి, 11 లావాదేవీలు అనుమానాస్పదంగా ఉన్నట్టు గుర్తించారు. హైదరాబాద్, గోవాల్లో జరిగిన పార్టీల్లో సినీ తారలు డ్రగ్స్ తీసుకున్నారా? అనే కోణంలోనూ పోలీసులు నిర్మాత కేపీ చౌదరిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
KP Chowdary
Drugs Case
Police
Tollywood

More Telugu News