Sensex: నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

  • 259 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 105 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • ఉదయం నుంచి నష్టాల్లోనే కొనసాగిన మార్కెట్లు
Markets ends in losses

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. స్మాల్, మిడ్ క్యాప్ సెగ్మెంట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు నష్టపోయి 62,979కి పడిపోయింది. నిఫ్టీ 105 పాయింట్లు పతనమై 18,665కి దిగజారింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.76%), భారతి ఎయిర్ టెల్ (1.60%), ఏసియన్ పెయింట్స్ (1.53%), ఎన్టీపీసీ (1.14%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.40%). 

టాప్ లూజర్స్:
టాటా మోటార్స్ (-1.77%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.48%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-1.44%), టాటా స్టీల్ (-1.35%), ఇన్ఫోసిస్ (-1.32%).

More Telugu News