Heavy Rains: హీట్ వేవ్ ముగిసింది... 10 రాష్ట్రాలకు భారీ వర్ష హెచ్చరికలు

  • అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు వర్ష సూచన
  • తెలంగాణలో విస్తరిస్తున్న రుతుపవనాలు
  • 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
Heavy rain warning to 10 states

దేశ వ్యాప్తంగా హీట్ వేవ్ ముగిసిందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 25, 26 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వాతావరణం చల్లబడిందని వెల్లడించింది. వర్షాలు కురవనున్న 6 జిల్లాల్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

More Telugu News