Team India: వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్ల ఎంపిక

  • వెస్టిండీస్ లో పర్యటించనున్న భారత జట్టు
  • జులై 12 నుంచి టూర్
  • టెస్టు, వన్డే జట్లకు సారథిగా రోహిత్ శర్మ
  • ఐపీఎల్ స్టార్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ముఖేశ్ కుమార్ లకు స్థానం
BCCI announces Team India Test and ODI squads for West Indies tour

త్వరలోనే ప్రారంభం కానున్న వెస్టిండీస్ టూర్ కు టీమిండియా టెస్టు, వన్డే జట్లను నేడు ప్రకటించారు. ఈ పర్యటనలో పాల్గొనే టీమిండియా టెస్టు, వన్డే జట్లకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. 

ఐపీఎల్ లో పరుగుల మోత మోగించిన యువ సంచలనం యశస్వి జైస్వాల్ టీమిండియా టెస్టు జట్టుకు ఎంపికవడం విశేషం. మొదటి బంతి నుంచి ధాటిగా ఆడే జైస్వాల్ కు వన్డే జట్టులో స్థానం లభించకపోవడం ఆశ్చర్యకరం. ఐపీఎల్ లో సత్తా చాటిన రుతురాజ్ గైక్వాడ్, మీడియం పేసర్ ముఖేశ్ కుమార్ లను కూడా సెలెక్టర్లు టీమిండియా టెస్టు, వన్డే జట్లకు ఎంపిక చేశారు. 

ఇక, టెస్టు వికెట్ కీపర్ గా తెలుగుతేజం కేఎస్ భరత్ తన స్థానం నిలుపుకున్నాడు. పెద్దగా ఆకట్టుకోలేకపోతున్న భరత్ కు వెస్టిండీస్ టూర్ చివరి అవకాశం అని భావిస్తున్నారు. విండీస్ తో టెస్టు సిరీస్ లో విఫలమైతే, ఈసారి స్థానం లభించకపోవచ్చు. 

కొన్నాళ్లుగా టెస్టుల్లో భారత్ కు కీలక బ్యాట్స్ మన్ గా ఉన్న పుజారాపై వేటు పడింది. పుజారా ఇటీవల పేలవ ఫామ్ లో ఉండడమే అందుకు కారణం.

విండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా 2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. టెస్టు సిరీస్ జులై 12న ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్ ముగిశాక జులై 27 నుంచి వన్డే సిరీస్, ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్ జరగనున్నాయి. టీ20 సిరీస్ కు సమయం ఉన్నందున జట్టును తర్వాత ప్రకటించనున్నారు.


టీమిండియా టెస్టు జట్టు...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్యా రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్, ముఖేశ్ కుమార్, జయదేవ్ ఉనద్కట్, నవదీప్ సైనీ.

టీమిండియా వన్డే జట్టు...
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జయదేవ్ ఉనద్కట్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముఖేశ్ కుమార్.

More Telugu News